Tholiprema release date postponed

రుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తొలి ప్రేమ’. ఈ నెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే అదే రోజున సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘ఇంటిలిజెంట్‌’ కూడా వస్తోంది. అందుకే ‘తొలిప్రేమ’ని ఒకరోజు ఆలస్యంగా అంటే.. 10న విడుదల చేస్తామంటున్నారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ నిర్మాత, ‘తొలిప్రేమ’ పంపిణీదారుడు దిల్‌రాజు మాట్లాడుతూ      ‘‘ఒకే రోజు రెండు మెగా చిత్రాలు విడుదల అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా చూడాలా? అనే గందరగోళంలో ఉన్నారు అభిమానులు. వాళ్ల కోసం ‘తొలిప్రేమ’ని ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తే బాగుంటుందని భావించాం. సి.కల్యాణ్‌కీ మాకూ మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ నెల 9నే రెండు చిత్రాల విడుదల తేదీలు ప్రకటించాల్సి వచ్చింది. పోటీ పడడం వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదు. ఏ సినిమా చేసినా కష్టపడతాం. అంతిమంగా డబ్బులు రావాలన్నది ప్రతి నిర్మాత ఆశయం. మామధ్య పోటీ ఉండకూడదు. అందుకే మాలో మేం మాట్లాడుకుంటాం. అయితే విదేశాల్లో ముందు అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో పంపిణీదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ‘తొలిప్రేమ’ సినిమా చూశా. ఈ సంస్థలో వచ్చిన మంచి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంద’’న్నారు. ‘‘ప్రేమికుల రోజు కానుకగా ఈ నెల 9న తీసుకొద్దామనుకున్నాం. ఈగోలకు పోకుండా బాధ్యత గల నిర్మాతగా ఈ నిర్ణయం తీసుకున్నామ’’న్నారు బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌.