Mahesh Babu 25th Movie

Mahesh Babu 25th Movie

‘రాజకుమారుడు’తో కథానాయకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు మహేష్‌బాబు. ఇప్పుడు 25వ చిత్రం మైలు రాయిని అందుకోబోతున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్‌కి ఇది పాతికో సినిమా. దిల్‌రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయిక. ‘భరత్‌ అనే నేను’ తరవాత మహేష్‌ నటిస్తున్న చిత్రమిదే. స్క్రిప్టు ఎప్పుడో పూర్తయింది. మహేష్‌ రాక కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది. వచ్చే నెల రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే.. కొన్ని ట్యూన్లు సిద్ధం చేశారట. ఈ చిత్రంలో మహేష్‌ లుక్‌ కూడా మారనున్నదని, అనుకున్న లుక్‌లోకి మారడానికి మహేష్‌ కాస్త సమయం తీసుకున్నారని, అందుకే ఈ చిత్రం ఆలస్యమైందని సమాచారం.