Mr Majnu

యువ కథానాయకుడు అఖిల్‌ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ అట్లూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ మొదటి వారంలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా కథ యూకే నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

అఖిల్‌ గత ఏడాది చివరిలో ‘హలో’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. దీని తర్వాత ఆయన కొత్త కథను ఎంచుకోవడానికి కాస్త సమయం కేటాయించారు. చివరికి ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు. అఖిల్‌ మూడో సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.